Home year1945 సత్యంలో అపారమైన బలం నిండి ఉంది.

సత్యంలో అపారమైన బలం నిండి ఉంది.

by Akhand Jyoti Magazine

Loading

మీరెప్పుడూ సత్యాన్ని పలకండి, మీ ఆలోచనలను సత్యంతో నింపండి, సత్యాన్ని ఆచరించండి మరియు మీరు సత్యంలో మునిగిపొండి. ఈ విధంగా చేయుట వలన ప్రచండబలం లభిస్తుంది అది ప్రపంచంలోని ఇతర బలాలన్నిటి కంటె అధికమైనది. సత్యంలో వెయ్యి ఏనుగుల బలముందని కన్ఫ్యూషియస్ అంటుండే వాడు, కాని నిజానికి సత్యంలో అపారమైన బలముంది. భౌతిక సృష్టిలోని ఏ బలానికి దానితో పోలిక లేదు.

ఎవరైతే తమ ఆత్మ ముందు సత్యవాదిగా ఉంటారో, తమ అంతరాత్మ చెప్పినట్టు ఆచరిస్తారో, ఆడంబరము, మోసము, టక్కరితనములను వదిలి వేసి నిజాయతీని తమ విధానంగా చేసుకుంటారో ఈ ప్రపంచంలో గొప్ప బుద్ధిమంతులు, ఎందుకంటే సదాచరణ కారణంగా మనిషి శక్తి స్వరూపుడౌతాడు. అతనిని ఎవరూ భయపెట్టలేరు. అతనికి ఎవరన్నా భయముండదు. అబద్ధం ఆడేవారు, కపటంతో వ్యవహరించే వారి హృదయం మాట మాటకు అనుమానంతో నిండి ఉండి రావి ఆకు వలె రెపరెపలాడుతూ ఉంటుంది.

ధనబలం, జనబలం, శరీరబలం, మనోబలం లాంటి అనేక రకాలైన బలాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కాని సత్యం యొక్క బలం వీటన్నిటి కంటె అధికమైనది. సత్యాన్ని ఆచరించే పురుషునిలో ఎంత శక్తి ఉంటుందంటే అతని ముందు మనుష్యులే కాదు, దేవతలే కాదు, భగవంతుడైనా శిరస్సు వాంఛలసిందే

అఖండజ్యోతి 1945 నవంబర్ 1వ పేజీ https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ

You may also like