వైరాగ్యం అంటే రాగాలను త్యజించుటయే. మనోవికారాలను, దుష్టభావాలను మరియు కుసంస్కారాలను రాగాలు అంటాము. అనవసరమైన మోహం, మమత, ఈర్ష్య, ద్వేషం, క్రోధం, శోకం, చింత, తృష్ణ, భయం, అసూయ మొదలైన వాటి కారణంగా మనిషి జీవితంలో గొప్ప అశాంతి మరియు ఉద్విగ్నత ఉంటుంది.
తత్వవేత్త అయిన సోక్రటీసు చెప్పినట్లు ప్రపంచంలో ఎన్ని కష్టాలున్నాయో అందులో ముప్పాతిక భాగం కల్పితాలే. మనిషి తన ఊహాశక్తి ఆధారంగా తనకు తాను ఆ కష్టాలను నిర్మించుకొని వాటిని తలచుకొని భయపడుతూ, దు:ఖితుడవుతుంటాడు. తను కోరుకుంటే తన కల్పానాశక్తిని శుభ్రపరచుకొని, తన దృష్టికోణాన్ని శుద్ధి చేసుకొని ఈ ఊహా జనిత దు:ఖాల జంజాటం నుండి తేలికగా విముక్తి పొందగలడు. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఈ విషయాన్నే సూత్రీకరించి ఈ విధంగా చెప్పారు. “వైరాగ్యం ద్వారా కష్టాలు నివృత్తి అవుతాయి”.
మనం మన మనసుకు నచ్చిన విధంగా సుఖాలను అనుభవించలేము. ధనం, సంతానం, అధిక ఆయుష్షు, జీవితం, సుఖం మరియు కోరిన పరిస్థితులు పొందాలనే తృష్ణ ఏ విధంగానూ పూర్తి కాదు. ఒక కోరిక పూర్తి అయిన వెంటనే పది ఇతర కోరికలు పుట్టుకొస్తాయి. వాటికి అంతం లేదు, పరిమితి లేదు. ఈ అసంతృప్తి నుంచి బయటపడటానికి సరైన ఉపాయం తన కోరికలు మరియు భావాలను నియంత్రణలో ఉ ంచుకోనుటయే. ఇటువంటి నియంత్రణ ద్వారా, వైరాగ్యము ద్వారానే దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుంది. దుఃఖాల నుంచి విముక్తి పొందుటకు వైరాగ్యమే ఏకైక ఉపాయం.
72
అఖండజ్యోతి 1948 నవంబర్ 15వ పేజీ https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ