దుష్టులైన వారు పాపమనే మూర్ఖత్వానికి భయపడరు. వివేకము కలవాడు ఆ మూర్ఖత్వం నుండి దూరంగా ఉంటాడు. చెడు నుంచి చెడే ఉ త్పన్నమవుతుంది. అందువలననే చెడును అగ్ని కంటే భయంకరమైనదిగా భావించి భయపడి దూరంగా ఉండాలి. మనిషికి తన నీడ ఎక్కడి కెళ్తే అక్కడకు వెళ్తూ వెంటనే ఉంటుందో అదే విధంగా పాపకర్మలు కూడా పాపి వెంటనే ఉండి చివరకు సర్వనాశనం చేస్తాయి. ఇందువలననే ఎల్లపుడూ అప్రమత్తంగా ఉండి చెడు అంటే భయం కలిగి ఉండాలి.
చెడు పనులను చేయవద్దు. ఎందువలననగా చెడ్డపనులు చేసే వాళు మృ అంతరాత్మ యొక్క శాపం అనే అగ్నిలో ఎల్లపుడూ కుమిలిపోతూ ఉ ంటారు. వస్తువులను ఎక్కువ పరిమాణంలో సేకరించాలనే కోరిక, ఇంద్రియ భోగలాలస మరియు ఆహంకారాన్ని తృప్తి పరచాలనే ఇచ్చతో లోకులు చెడు మార్గాలలో ప్రవేశిస్తున్నారు. కాని ఈ మూడు చాలా తుచ్ఛమైనవి. వీటి వలన క్షణిక తృప్తి లభిస్తుంది కాని చివరకు అపారమైన దుఃఖాన్ని భరించవలసివస్తుంది. చక్కెర కలిసిన విషాన్ని లోభంతో తినే వాడు బుద్ధిమంతుడు కాడు.
ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద బుద్ధిమంతుడు, విద్వాంసుడు, చతురుడు మరియు తెలివైన వాడు ఎవరంటే తనను చెడు ఆలోచనలు, చెడ్డపనులు నుంచి కాపాడుకుంటూ, సత్యాన్ని స్వీకరించి, సన్మార్గంలో నడుస్తూ మంచి ఆలోచనలను గ్రహించేవాడు. ఈ తెలివే చివరకు లాభదాయకంగా మిగులుతుంది, మరియు దుష్టత్వం చేసే వారు వారి వెర్రితనం వలన జరిగే నష్టం కారణంగా తల కొట్టుకొని పశ్చాత్తాప పడతారు.
71
అఖండజ్యోతి 1948 నవంబర్ 1వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ